నేడు కళ్ళ జోడు ఉపయోగించేవారి సంఖ్య రోజురోజూకూ పెరరుగుతోంది. వంశపారంపర్యంగా అయితేనేమి, సరయిన పౌష్టకాహారం తీసుకోకపోవడం వల్లనయితేనేమి ఈ రోజుల్లో చాలామంది సైట్ తో ఇబ్బందిపడుతున్నారు. కళ్ళజోడు ధరించేవారి సంఖ్య పెరుగుతోంది. కళ్ళజోడు కంటే ఎక్కువ సౌకర్యంగా వుండేవి కాంటాక్ట్స్ లెన్స్ వాటిని వాడటం వల్ల ముఖం అందం చెదరకు, తమకు సైట్ వుంది అన్న విషయం బయటివారికి తెలిచదని, పెరిగే వయసుతోపాటు ఎక్కువ అయ్యే సైట్ కాటాక్ట్ లెన్స్ వాడటం వల్ల ఎక్కువగా పెరగదన్న ఉద్దేశంతో వీటినే ఎక్కువ వాడుతున్నారు. యువతీ, యువకులు, స్త్రీలు ,పురుషులు ఏ రంగంలో పనిచేసివారికయినా మామూలు కళ్ళజోడుకంటే కాంటాక్ట్ లెన్స్ లు సౌలభ్యంగా ఉంటున్నాయి. అందుకే కొం ధర ఎక్కువయినా కాంటాక్ట్ లెన్సులు ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాటి వాడకంలో కొంత మెళకువతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటివల్ల ఇబ్బంది లేకుండా వుంటుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే కాంటాక్ట్ లెన్స్ ధరించకూడదు. స్నానం చేసిన తర్వాత ముఖానికి కాస్మోటిక్స్ రాసుకున్న తర్వాత ధరించాలి. కళ్లకు లెన్సు వున్నపుడు ముఖాన్ని సబ్బుతో కడగకూడదు. లెన్స్ వున్నపుడు ఐలెనర్స్ కానీ, కాటుక కానీ, ఉపయోగించకూడదు. మెళకువగా ఉన్న సమయమంతా లెన్స్ ఉపయోగించవచ్చు. నిద్ర పోయే టప్పుడు వాటిని తీసివేయాలి. చేతులు, కళ్లు, ముఖం శుభ్రంగా కడిగిన తర్వాతే లెన్స్ పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు లెన్సులు తీసేటప్పుడు ముందుగా ఏ కంటి లెన్సుతీస్తే ఈ డబ్బా మూతతెరిచి వుంచాలి. ఒక కంటి లెన్సు డబ్బాతో పెట్టి మూతపెట్టిన తర్వాత రెండవబాక్సు మూతతీసి రెండోలెన్సు తీయాలి. రెండు రోజులకు ఒకసారి లెన్సులు పెట్టే బాక్సులో సొల్యూషన్ మార్చాలి. సొల్యూషన్ కంటి డాక్టర్ సూచించిన కంపెనీదేవాడాలి. ఏ కంటి లెన్స్ ను ఆ బాక్సులోనే పెట్టాలి. ఉదా.. కుడికంటి లెన్స్ ను ఆర్ అని రాసివున్న డబ్బాలో పెట్టాలి. అలాగే ఎడమ కంటి లెన్సును ఎల్ అని రాసివున్న డబ్బాలో పెట్టాలి. లేకపోతే లెన్స్ లు తారుమారయ్యే ప్రమాదం వుంది. కాంటాక్ట్ లెన్సు వాడుతున్నపుడు కళ్ళు ఏ మాత్రం తేడాగా ఉన్నా వెంటనే కంటి డాక్టర్ ను సంప్రదించాలి. లెన్సుల జీవితం సాధారణంగా 12 నెలలు మాత్రమే, కంటికి ఏ విధముయిన సమస్యలేదు కదా అని వాటినే వాడకూడదు. కొత్త లెన్స్ తీసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: